#Jugaadistan ట్రైలర్ టాక్

సుమీత్ వ్యాస్‌తో పాటు అర్జున్ మాథుర్, పరంబ్రత ఛటర్జీ, రుక్సార్ ధిల్లాన్, తారక్ రైనా, గోపాల్ దత్ మరియు అహ్సాస్ చన్నా కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ జుగాదిస్థాన్ (Jugaadistan). లయన్స్ గేట్ ప్లే (LIONSGATE PLAY) నుంచి వస్తున్న రెండో వెబ్ సిరీస్ ఇది. ఆకర్ష్ ఖురానా మరియు అధార్ ఖురానా దర్శకత్వం వహించారు. మార్చి 4 నుంచి లయన్స్ గేట్ ప్లే లో జుగాదిస్థాన్ స్ట్రీమింగ్ కానుంది.

ఈ నేపథ్యంలో గురువారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. 
కాలేజ్ నేపథ్యంలో ట్రైలర్ ను సరదా కట్ చేశారు. గొడవలు, కాలేజ్ ఎన్నికలు.. సస్పెన్స్ అంశాలతో ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. సిరీస్ పై అంచనాలు పెంచేలా ఉంది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసి.. ఈ వెబ్ సిరీస్ ను తీసుకొస్తున్నారు.