వలిమై ప్రోమో-9.. అదిరింది !

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వలిమై’. సి హెచ్ వినోద్‌ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సరికొత్త ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం. కేవలం 27 సెకన్ల నిడివి గల ఈ ప్రోమో అదిరిపోయింది. బస్సు నడుపుతూ.. బైక్ రేసర్స్ తో అజిత్ చేసిన యాక్షన్ బిట్ సీన్ రొమాలు నిక్కబొడిచేలా ఉంది.

ఈ సినిమా టీజర్, ట్రైలర్ , పాటలకు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా యక్షన్ ప్రియులకు వలిమై ఓ విందు భోజనంలా ఉండనుందని తెలుస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వలిమై విడుదల కాబోతున్నది. ఈ సినిమా తెలుగు రైట్స్ భారీ రేటు పలికినట్టు సమాచారం. అయితే పోటీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ ఉండటం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.

ఇక ఫిబ్రవరి 24న తెలుగు రాష్ట్రాలలో కేవలం ఒక్కరోజు మాత్రమే ఎక్కువ థియేటర్లలో ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఫిబ్రవరి 25న పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ విడుదల కాబోతోంది. ఆడవాళ్లు మీకు జోహార్లు, శెబాస్టియన్ పి సి.524, గంగు భాయ్, గని వంటి మూవీ లో కూడా విడుదలవుతున్నాయి. అందుచేతనే వలిమై మూవీ 24 వ తేదీ మాత్రమే పెద్ద ఎత్తున విడుదల కావాల్సి ఉంటుంది.