‘రాధే శ్యామ్’ నాల్గో సాంగ్

రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తర్వాత తన దూకుడును పెంచాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలొ  ‘జిల్’ మూవీతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధే శ్యామ్’ అనే రొమాంటిక్ ఫీల్ గుడ్ మూవీని మొదలు పెట్టాడు. తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలున్నాయి.

ప్రభాస్ తన  కెరీర్‌లోనే తొలిసారి రొమాంటిక్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులే అయిన  మధ్యలో అనుకోని అవాంతరాల కారణాల వల్ల చాలా సార్లు షూటింగ్ వాయిదా పడింది.  ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పాటలను కూడా విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదలకు అంతా రెడీ అనుకున్న సమయంలోనే కరోనా ప్రభావం కారణంగా ఇది వాయిదా పడిపోయింది. దీంతో ప్రమోషన్ మళ్లీ మొదటికి వచ్చింది.

ఈ సినిమాలో  ప్రభాస్ జ్యోతిష్యునిగా నటించాగా   పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో  ఇప్పటికే మూడు పాటలు విడుదల అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు నాలుగో పాటను విడుదల చేయబోతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ సినిమా నుంచి ఇక పాటలను విడుదల చేయకూడదని చిత్ర యూనిట్ భావించింది. కానీ, ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు ఓ స్పెషల్ లవ్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం.