‘శాకుంతలం’ ఫస్ట్ లుక్‌ ఎప్పుడంటే.!?

రుద్రమదేవి ఫేమ్  గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శాకుంతలం’. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఫిబ్రవరి 21న ఉదయం 9:30 గంటలకు ‘శాకుంతలం’ సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ అప్‌డేట్ ఉన్న పోస్టర్‌ను వదిలారు. 

పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో    సమంత సరసన దుష్యంతుడి  పాత్రలో  మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు.  అలాగే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ భరతుడు పాత్ర ద్వారా తెలుగుతెరకు బాల నటిగా పరిచయమవుతోంది.  ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు