కళావతి సాంగ్.. సితార స్టెప్పులు

సూపర్ స్టార్ మహేష్ కూతురు మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ తాజా సినిమా సర్కారు వారి పాట నుంచి తొలి పాటగా కళావతి ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ… దూసుకుపోతుంది.

ఇప్పుడీ.. ఈ సాంగ్ కు సితార అదిరిపోయే స్టెప్పులేసింది. అచ్చం తండ్రిని ఇమిటేట్ చేసింది. మహేష్ బాబు (Mahesh Babu) పాటలకు డాన్స్ చేయడం సితారకు కొత్తేం కాదు. ఎప్పటికప్పుడు కొత్త పాటను ఇమిటేట్ చేస్తూ.. సూపర్ స్టార్ లా డాన్స్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం.

పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట తెరకెక్కుతోంది. మహేష్ కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది.