భీమ్లా నాయక్ ట్రైలర్ టాక్

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. నిత్యా మీనన్, నివేదా థామస్ హీరోయిన్స్. ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించారు. థమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ వారమే భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠన్మారణం తో వాయిదా పడింది. కానీ ట్రైలర్ ను మాత్రం అనుకున్న టైమ్ కే విడుదల చేశారు.

పవర్ స్టార్ నుంచి ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో.. సరిగ్గా ఆ కొలతలతో ట్రైలర్ ను కట్ చేశారు. పవన్-రానా మధ్య దగ్గాపోరు సన్నివేశాలు ఉన్నాయి. ఖాకీ డ్రెస్ లో పవన్ విశ్వరూపం చూపించాడు. ఆయనకు సవాల్ విసిరే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ వ్యక్తిగా డానియల్ శేఖర్ పాత్రలో రానా రెచ్చిపోయి నటించారు. వీరిద్దరి నటనకు తోడు త్రివిక్రమ్ మాటలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. ట్రైలర్ మూడ్ ను చూస్తుంటే.. గబ్బర్ సింగ్ కొలతలతో భీమ్లా నాయక్ ఉండనున్నట్టు అర్థమవుతుంది. మరీ… ఆ మేజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.