కియారా.. కేక

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ లెటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. యెల్లో సారీ, గోధుమ కలర్ జాకెట్, ఝుమ్కాలు ధరించి ఓ అవార్డు ఫంక్షన్ లో మెరిసింది.. ముద్దుగుమ్మ. పనిలో పనిగా చిన్నపాటి ఫోటో షూట్ సెషన్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మహేష్ ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కియారా. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’లో రామ్ చరణ్ తో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం #RC15లో నటిస్తుంది. ప్రస్తుతం కియారా నాలుగు సినిమాల్లో నటిస్తోంది. #RC15 తో పాటు.. భూల్ భూలయ్యా 2, గోవింద నామ్ మేరా, జగ్ జగ్ జీయో సినిమాల్లోనూ కియారా హీరోయిన్ గా నటిస్తోంది.
