రాజ్యసభకు ప్రకాష్ రాజ్ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర టూర్ లో నటుడు ప్రకాష్ రాజ్ కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. అయితే ప్రకాష్ రాజ్ విషయంలో సీఎం కేసీఆర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ను రాజ్యసభకు పంపించనున్నారని సమాచారం. అంతేకాదు.. కేంద్రంలో కీలక బాధ్యతలను అతడికి అప్పిగించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్ రాజ్యసభకు రాజీనామా చేసారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. ఆ సీటుతో పాటుగా ఈ ఏడాది జూన్ లో టీఆర్ఎస్ ఇద్దరు సభ్యులు లక్ష్మీకాంత రావు…డీ శ్రీనివాస్ పదవీ విరమణ చేయనున్నారు. వీటిలో ఒకటి ప్రకాశ్ రాజ్ కు కేటాయించి..ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఇక.. కేసీఆర్, స్టాలిన్ భేటీ వెనుక ప్రకాష్‌రాజ్ కీలకం కానున్నారని చెబుతున్నారు.