రౌడీతో రస్మిక పెళ్లి ఫిక్స్
నేషనల్ క్రష్ రష్మిక మందనతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నాడు. గత కొంతకాలంగా ఈ జంట డేటింగ్ లో ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఈ జంట పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రౌడీ-రస్మిక పెళ్లి చేసుకోనున్నారు. ప్రేమ పై ఇప్పటి వరకు ఈ జంట నోరు తెరవలేదు. ఇక పెళ్లి న్యూస్ పై స్పందించే ఛాన్స్ లేదు. ఏదైనా జరుగుతుంటే చూడాల్సిన పరిస్థితి.
విజయ్ దేవరకొండ-రష్మిక మందన లది హిట్ పెయిర్. ‘గీత గోవిందం’ కోసం తొలిసారి జతకట్టింది.. ఈ జంట. ఆ తర్వాత ‘డియర్ కామ్రెడ్’ కోసం రెండోసారి కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అనే ప్రచారం మొదలైంది. కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో రష్మిక విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించింది. ఫ్యామిలీ కలిసి సరదా గడిపింది. లైగర్ షూటింగ్ కోసం ముంబైలో బిజీగా ఉన్న విజయ్ ని కలవడానికి అక్కడికి వెళ్లింది. ఇద్దరు కలిసి ముంబై వీధుల్లో షికారు చేశారు. ప్రస్తుతం విజయ్ లైగర్ సినిమాతో బిజీగా ఉండగా.. రష్మిక.. మిషన్ మజ్ను, గుడ్ బై బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.