ముదురు-లేత.. నాన్ స్టాప్ !

శకున్ బట్రా దర్శకత్వం దర్శకత్వంలో దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే, ధైర్య కర్వా ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం ‘గెహ్రైయాన్’. ఈ రొమాంటిక్ డ్రామా ఫిబ్రవరి 11న నేరుగా ఓటీటీలో (అమెజాన్ పైమ్) విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ముదురు ముద్దుగుమ్మ దీపికా పదుకొనె, లేలేత అందం అనన్య పాండే పోటీ పడి మరీ.. అందాలు ఆరబోస్తున్నారు. 

సినిమా రిలీజ్ కు దాదాపు నెల ముందు నుంచే వీరి గ్లామర్ షో స్టార్ట్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజై పది రోజులు దాటుతున్నా.. ఆ డేసు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. ముఖ్యంగా దీపికా పదుకొనె తనదైన హాట్నెస్ తో హీటెక్కిస్తోంది. తాజాగా వైట్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ ఇచ్చిన రొమాంటిక్ పోజులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు అనన్య యెల్లో బికినీలో రెచ్చిపోయింది. ఆమెకు పోటీ అన్నట్టు దీపికా యెల్లో బికినీలోకి మారిపోయి షో చేసింది. మొత్తానికి.. వీరి అందాల ఆరబోతకు ఇప్పట్లో పులిస్టాప్ పడేలా కనిపించడం లేదు.