సన్నీ లియోన్ బ్లూ లవ్

2012లో వచ్చిన ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ లియోన్. జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్2, ఏక్ పహెలే లీలా, వన్ నైట్ స్టాండ్.. తదితర సినిమాల్లో నటించింది.

బిగ్ స్క్రీన్‌పై బికినీలతో అట్రాక్ట్ చేసింది. నటిగా, ఐటమ్ స్పెషలిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ తెరపై కూడా మెరిసింది. కరెంట్ తీగ, గరుడ వేగ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలు, స్పెషల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది.

తన అభిమానులను ఎలా సంతృప్తి పరచాలో సన్నీకి బాగా తెలుసు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంటుంది.

తాజాగా బ్లూ గౌనులో హాట్ బ్యూటీ మెరిసింది. గౌను వేసుకున్న ఆనందంలో పరుగులు పెడుతూ.. ఆనందం వ్యక్తం చేసింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.