కృష్ణం రాజు కూతురికి ‘గోపికృష్ణ’ బాధ్యతలు

గోపికృష్ణ – రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత బ్యానర్. గతంలో ఈ బ్యానర్ పై చాలా సినిమాలు వచ్చాయి.  ‘రాధే శ్యామ్’తో మళ్ళీ గోపికృష్ణ బ్యానర్ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గోపికృష్ణ బ్యానర్ మళ్ళీ యాక్టివ్ కావడం వెనుక కృష్ణం రాజు కుమార్తె సాయి ప్రశీద వున్నారు. ఇకపై ఈ బ్యానర్ బాధ్యతలు అన్ని ఆమెని నిర్వహించనున్నారని తెలిసింది.

ప్రశీద సాహో చిత్రానికి కొన్నాళ్ళు పనిచేశారు. తర్వాత లండన్ లో మాస్టర్స్ చేశారు. దీని తర్వాత ముంబాయిలో ఒక సినిమాకి పని చేశారు. అమెరికాలో ప్రొడక్షన్ కోర్స్ చేశారు. తర్వాత అక్కడ నెట్ ఫ్లిక్ష్ లో ఓ వెబ్ సిరిస్ ఎక్సక్యుటీవ్ ప్రొడ్యుసర్ గా చేశారు. నిర్మాణంలో పూర్తి స్థాయి అనుభవం వచ్చిన తర్వాతే ఇప్పుడు గోపికృష్ణ బ్యానర్ లో సినిమాలు, వెబ్ కంటెంట్ క్రియేట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. ప్రస్తుతం ప్రశీద ఓ ప్రముఖ ఓటీటీ వెబ్ సిరిస్ ని ప్లాన్ చేస్తున్నారు.