మద్యం మత్తులో సమంత

స్టార్ హీరోయిన్ సమంత మద్యం కిక్కులో కనిపించింది. అలాగని ఆమె ఫుల్లుగా తాగి.. ఊగలేదు.  #MadeofPride, #BlendersPride బ్రాండ్లను ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోలో సామ్ హాట్ హాట్ గా కనిపించింది. 

భర్త నాగ చైతన్య తో విడిపోయాక సమంత రెండు లక్ష్యాలు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఇందులో ఒకటి నటిగా తానేంటో నిరూపించుకోవాలి. రెండోది గట్టిగా డబ్బులు సంపాదించాలి. మొదటి లక్ష్యాన్ని సంబంధించి ఇప్పటికే పక్కా ప్రణాఌకను సిద్ధం చేసుకుంది. దానిని అమలు చేస్తుంది కూడా. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాలకు సైన్ చేసినట్టు తెలిసింది. 

ఇక డబ్బులు సంపాదించే విషయంలోనూ సామ్ తగ్గేదేలే అంటోంది. ఓ పక్క సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూనే మరోపక్క కొత్త కొత్త బిజినెస్ లోకి అడుగుపెడుతుంది. నిన్న తన ఫ్రెండ్ శిల్పా రెడ్డి సంస్థ సస్టైన్ కార్ట్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించేసింది.

ఇక ఇప్పుడు ఆల్కహాల్‌కు సంబంధించిన ప్రకటనల్లో నటించింది. ప్రముఖ విస్కీ సంస్థ బ్లెండర్స్ ప్రైడ్ బ్రాండ్‌ను సమంత ప్రోత్సహిస్తోంది. ఇందుకు గానూ భారీ మొత్తంలో పుచ్చుకున్నట్టు సమాచారం. కిక్కునిచ్చే ప్రకటనలో సామ్ కనిపించడంపై ఆమె అభిమానులు కూడా ఖుషి అవుతున్నరు. 

Slayer #Samantha ❤️😍 in for #MadeofPride #BlendersPride#SamanthaRuthPrabhu #Samantharuthprabhu𓃵 #SamanthaRuthPrabhuhot #Samanthahot #SamanthaAkkineni pic.twitter.com/XhXYqDuxPx— OTTRelease (@ott_release) March 9, 2022