మారన్ డిజాస్టర్

ధనుష్ – మాళవిక మోహనన్ జంటగా నటించిన చిత్రం ‘మారన్’. కార్తిక్ నరేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సముద్రఖనీ విలన్ గా నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. టీ.జీ త్యాగరాజన్ నిర్మాత. భారీ అంచనాల మధ్య మారన్ శుక్రవారం ఓటీటీలో విడుదలైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరిస్తున్నారు. ధనుష్, మాళవిక మోహన్, సముద్రఖని.. ఇలా ప్రధాన తారాగణం నటన బాగున్నా.. కథ-కథనం ఆకట్టుకునేలా లేదు. Outdated Story. ఎన్నో సినిమాల్లో ఇలాంటి కథను చూశాం. ఓటీటీలో రిలీజై మారన్ బతికి పోయింది.. అదే థియేటర్స్ లోకి వచ్చి ఉంటే భారీ నష్టం తప్పేది కాదని అంటున్నారు.

ధనుష్-సృతి వెంకట్ ల మధ్య కెమిస్ట్రీ బాగుంది. మాళవిక మోహన్ గ్లామర్ సినిమాకు  ప్లస్ అయింది. జీవి ప్రకాష్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. క్లైమాక్స్ కూడా బాగుంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన మైనస్. రైటింగ్ చాలా పూర్ గా ఉంది. కార్తిక్ నరేన్ ఈ విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. డైరెక్షన్ కూడా ఏం బాగులేదు. ఎన్ని ఎలివేషన్ సీన్స్ తప్పా.. అన్ని రొటీన్ అనిపిస్తాయి. మొత్తానికి.. మారన్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.