ఇది ఫామ్ హౌస్ జ్వరం ?
సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి యశోద హాస్పటల్ కి వచ్చి.. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నారు. టెస్టుల రిపోర్టులు అన్నీ బాగానే వచ్చాయి. గత రెండ్రోజులుగా ఎడమ చేయి, ఎడమ కాలు గుంజుతున్నయి. ఏమైన గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా ? అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే కేసీఆర్ గుండె గట్టిగానే ఉంది. గుండెకు సంబంధించిన అన్ని రకాల టెస్టులు చేశాం. ఏ ఇబ్బంది లేదని యశోధ డాక్టర్లు చెప్పారు. ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని సూచించారు. దీంతో కెసీఆర్ తనకిష్టమైన ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నట్టు సమాచారం.
కేసీఆర్ అనారోగ్యానికి గురికావడంపై ప్రజల్లో రెండు రకాల చర్చ జరుగుతున్నది. ఇందులో ఇటీవల కేంద్రంపై యుద్ధం ప్రకటించి.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీపైనే తీవ్ర విమర్శలు చేస్తున్న కేసీఆర్ కు ఐదు రాష్ట్రాల ఫలితాలు షాక్ ఇచ్చాయి. నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారం తిరిగి నిలబెట్టుకుంటుందని కేసీఆర్ ఊహించలేదు. ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు కూడా. ఐదు రాష్ట్రాల ఫలితాల వలన కలిగిన స్ట్రోక్ వలనే కేసీఆర్ అస్వస్థతకు గురై ఉంటారని ఒకవర్గం వాదిస్తున్నది. మరో వర్గం మాత్రం సారు ఫాంహౌస్ పై బెంగ పెట్టుకున్నారు. ఇటీవల వరుసగా టూర్ లు , బిజీ షెడ్యూల్ వలన ఫామ్ హౌస్ మొహం చూడలేదు. ఆ బెంగతోనే దివాలు తీశాడని సరదాగా చెప్పుకుంటున్నారు. ఏదేమైనా సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని.. ఎప్పటిలాగే తిరిగి యాక్టివ్ కావాలని కోరుకుందాం.