#Runway34 రిలీజ్ డేట్ ఫిక్స్

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీ. ఏకంగా ఏడు సినిమాల్లో నటిస్తోంది. వీటిలో #Runway34 ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు-నిర్మాత-హీరో కూడా అజయ్ దేవగణ్ నే. ఆయనకు జంటగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బిగ్ బీ అమితాబ్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ డ్రామా థ్రిల్లర్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం అధికార ప్రకటన చేసింది. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇక రకుల్ నటించిన ఎటాక్, డాక్టర్ జీ, థ్యాక్ గాడ్, అయాలన్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి సినిమాలు కూడా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ‘ఛత్రివాలి’లో రకుల్ కండోమ్ టెస్టర్ గా కనిపించనుంది. ఈ చిత్రానికి తేజస్ విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవేగాక.. 31 అక్టోబర్ లేడీస్ నైట్, ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తోంది రకుల్.