హాట్ & క్యూట్

స్టార్ హీరోయిన్ సమంతకు స్వాతంత్య్రం వచ్చేసింది. భర్త నాగ చైతన్యతో  విడిపోయిన తర్వాత తనకు ఇష్టం వచ్చినట్టు బతుకుతుంది. సినిమాలు, బయట కూడా గ్లామర్ గా కనిపిస్తుంది. ఫోటో షూట్స్, కమర్షియల్ యాడ్స్ లో హాట్ కనిపిస్తుంది. చివరికి సినిమా ఫంక్షన్ లోనూ బోల్డ్ అవతార్ లో దర్శనమిస్తుంది.

ఇటీవల ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌ కార్యక్రమంలో ఓవర్ డోస్ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది సామ్. ఎద అందాలను వడ్డించింది. పుష్ప ఐటమ్ సాంగ్ లో మీరు చూసింది తక్కువే. ఇప్పుడు చూడండి అన్నట్టుగా హాట్ & క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది. సామ్ చాలా కసిగా ఉంది. నటిగా తనేంటో నిరూపించుకోవాలని ఆశపడుతుంది. బాలెవుడ్, హాలీవుడ్ లోనూ రాణించాలని.. గ్లోబల్ స్టార్ గా పిలిపించుకోవాలనే బలమైన కోరికతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది.

ఈ క్రమంలో ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ తో పాటు.. బాలీవుడ్ లో పలు సినిమాలకు సైన్ చేసింది. ప్రస్తుతం సామ్ యశోధ సినిమాలు నటిస్తోంది. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సామ్ త్వరలోనే మీడియా ముందుకు రానుంది. తన సినిమాను ప్రచారం చేసుకోనుంది.