వరుణ్ ధావన్ తో సమంత.. వైరల్ !

స్టార్ హీరోయిన్ సమంత ముంబైలో వాలిపోయింది. ఆమెని బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ దగ్గరుండి రిసీవ్ చేసుకున్నారు. ఈ సమయంలో వీరిద్దరిని మీడియా చుట్టుముట్టింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే సామ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ది ఫ్యామిలీ 2లో నటించింది. పుష్ప ఐటమ్ సాంగ్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

అయితే బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేయాలని ఆశపడుతున్న సామ్.. రాజ్ & డీకే దర్శకత్వంలో వస్తున్న మరో వెబ్ సిరీస్ #Citadel లో నటించనుంది. ఈ వెబ్ సిరీస్ కోసమే తాజాగా సామ్ ముంబై వెళ్లింది. అక్కడ ఆమెకు ఘన స్వాగతం లభించింది. సమంత.. సమంత అంటూ బాలీవుడ్ మీడియా హంగామా చేసింది.

ఈ వెబ్ సిరీస్ ను కూడా అమెజాన్ ప్రైమ్ కోసం తీసుకొస్తున్నారు రాజ్ & డీకే. ఇందులో వరుణ్ ధావన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇదే టైటిల్ #Citadel తో అమెరికన్ టీవీ సిరీస్ కూడా వస్తోంది. ఇందులో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. మరీ.. హాలీవుడ్, బాలీవుడ్ #Citadel కు తేడా ఏంటీ అన్నది తెలియాల్సి ఉంది.