ప్రభాస్ వయసుపై విమర్శలు
ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా శుక్రవారం విడుదలైయింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో ఎమోషనల్ కనెక్షన్ లేదని, అసలు ఆ మాత్రం కథ చెప్పడానికి ప్రభాస్ లాంటి స్టార్, అంత సెటప్ ఎందుకని విశ్లేషణలు ఇచ్చారు. అటు బాలీవుడ్ జనాలకు కూడా సినిమా పెద్దగా నచ్చలేదు. అంతేకాదు.. సినిమాలో ప్రభాస్ వయసుపై కూడా విమర్శలు చేస్తున్నారు.
రాధేశ్యామ్ లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీని ప్రభాస్ తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ అనుమపకి నచ్చలేదు. ”42 ఏళ్ల వయసున్న ప్రభాస్ కి 52 ఏళ్ల భాగ్యశ్రీని తల్లిగా పెట్టుకోవడం ఏంటి? అని ప్రశ్నించింది. కాస్త వయసు చూసుకోవాలి కదా ? కామెంట్ చేస్తున్నారు. మరోవర్గం ప్రభాస్ చాలా ముదిరిపోయాడు. అతడి వయసు తెరపై కనిపిస్తుంది అంటున్నారు. మొత్తానికి.. రాధేశ్యామ్ లాంటి కాస్ట్లీ ప్రేమకథతో ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు డార్లింగ్ ప్రభాస్.