టాలీవుడ్ లో మరో యువజంట విడాకులు ?

లేటెస్ట్ గా టాలీవుడ్ లో మరో యువజంట విడాకుల దిశగా పయనిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ జంట వివాహం చేసుకుని మరీ ఏళ్లూ అయిపోలేదు. కానీ విడాకుల వరకు వెళ్లకుండా ఇరు వైపుల వర్గాలు సర్దిచెబుతున్నాయని అంటున్నారు. ప్రస్తుతానికి మరీ ఎక్కువగా వినిపించడం లేదు. సర్దుబాటు కుదరకపోతే మాత్రం పక్కాగా బయటకు వస్తుందీ వార్త.
ఇటీవల కాలంలో సెలబ్రెటీల విడాకుల వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అమీర్ ఖాన్-కిరణ్ రావ్, ధనుష్-ఐశ్వర్య, నాగ చైతన్య-సమంత దంపతులు విడాకులు తీసుకున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ కపుల్స్ వీరి దారిలో నడవనున్నారు. వ్యవహారం విడాకుల దాకా వచ్చేలా ఉందని సమాచారం.