బుట్టబొమ్మ.. ట్రెండీ లుక్స్

పూజా హెగ్డే ఎక్కడికెళ్లినా అగ్ర తాంబూలం అందింది. స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇంతటీ బిజీలోనూ అభిమానుల కోసం స్పెషల్ ఫోటో షూట్స్ చేస్తోంది. తాజాగా ట్రెండీ లుక్ లో కిర్రాక్ పోజులిచ్చింది పూజా.

ప్రభాస్-పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ గత ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్సిడ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. ఇక కోలీవుడ్ స్టార్ విజయ్ జంటగా పూజా నటించిన బీస్ట్ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ లోనూ పూజా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తుంది. అంతేకాదు.. పాన్ ఇండియా సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది.. ఈ ముద్దుగుమ్మ.

