రంగులు పూసి.. ముద్దులు పెట్టి

లాస్ ఏంజిల్స్‌లో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ దంపతులు హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదా గడిపారు. భర్త నిక్ కు రంగులు పూసిన ప్రియాంక.. ముద్దుల్లో ముంచేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రియాంక-నిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

వాస్తవానికి శుక్రవారమే బాలీవుడ్ తారాల హోలీ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటికొచ్చాయి. వైరల్ అయ్యాయి. ప్రియాంక మాత్రం కాస్త ఆలస్యంగా హోలీ ట్రీట్ ఇచ్చింది. లేటైనా ఘూటైనా ఫోటోలను షేర్ చేసింది.. ఈ ముద్దుగుమ్మ.
