RRR రూ. 100 అదనం

తెలంగాణలో మరోసారి సినిమా టికెట్ రేట్లు పెంచారు. ఈసారి ప్రత్యేకంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జీవో విడుదల చేసింది కేసీఆర్ సర్కారు. తెలంగాణ అంతటా ఈ సినిమా కోసం అదనంగా వంద రూపాయల వరకు ఛార్జ్ చేసుకోవచ్చనేది ఈ జీవో సారాంశం.
తెలంగాణలో ఆల్రెడీ గరిష్ట టికెట్ ధర 295 రూపాయలుంది. బుక్ మై షోలో ఈ టికెట్ బుక్ చేసుకుంటే అటుఇటుగా 330 రూపాయలు అవుతోంది. ఇప్పుడు దీనికి అదనంగా గరిష్ఠంగా వంద రూపాయల వరకు పెంచుకోవచ్చంటోంది కొత్త జీవో.
ఇలా తలా ఒక్కింటికి 430 రూపాయలు టికెట్ అంటే.. కుటుంబం అంతా కలిసి ఆర్ఆర్ఆర్ చూడాలంటే వేలకు వేలు వదిలించుకోవాల్సిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజానీకం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. రూ. 1000కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తే.. టికెట్ రేట్ రూ. 1000 పెంచుతారా ? అని ప్రశ్నిస్తున్నారు.