దసరా ఫస్ట్ లుక్.. నాని ఊరమాసు

నాచురల్ స్టార్ నాని హీరోగా ద‌స‌రా అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీ‌కాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ చెరుకూరి నిర్మాత‌. ఈ సినిమా నుంచి నాని ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. అందులో నానిని మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు.

ఒత్తైన జుత్తు, మాసిన గ‌డ్డం, లుంగీ, బ‌నీను, మెళ్లో చైను, నడుముకి రెండు క్వార్ట‌ర్ బాటిళ్లూ… నానిని ఎప్పుడూ ఇంత మాస్ గా చూడలేదు. నాని న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది. తెలుగు, హిందీ, కన్న‌డ‌, మ‌ల‌యాళ, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేస్తున్నారు.