RRR సెన్సార్ రివ్యూ
తొలితరం స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ పాత్రలతో ఓ పెద్ద యాక్షన్ డ్రామా తీశాడు రాజమౌళి. దాన్ని ఈనెల 25న అంతా చూడబోతున్నాం. అయితే రిలీజ్ కి ముందే వివిధ వర్గాల ద్వారా సినిమా టాక్ బయటికొస్తుంది. గత ఏడాది ఆఖరులోనే ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు బయటికొస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ కు సెన్సార్ బోర్డ్ ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఆర్ ఆర్ ఆర్ రైన్ టైమ్ 3 గంటల, 06 నిమిషాల, 54 సెకండ్స్ గా లాక్ చేశారు. సెన్సార్ రిపోర్ట్ తో పాటు సినిమా టాక్ కూడా బయటికొచ్చింది. సినిమా ఆధ్యాంతం అద్భుతంగా ఉందని సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యుల మాట అని తెలుస్తున్నది.
రాజమౌళీ ప్రేక్షకులను కథలో లీనం చేసే విధంగా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పాత్రను తీర్చిదిద్దిన విధానం.. ఆ పాత్రను తెరపైకి ఎంట్రీ ఇచ్చే విధానం. ఆ పాత్రలను చివరి వరకు నడిపిన తీరు మహా అద్భుతం అంటున్నారు. ఇక దేశ భక్తితో రొమాలు నిక్కబొడిచే సన్నివేశాలు సినిమాలు చాలానే ఉన్నాయట. ముఖ్యంగా తారక్, చరణ్ ల నటన కు ఆస్కార్ అవార్డ్ ఇచ్చినా తక్కువే అని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. మొత్తానికి.. ఆర్ ఆర్ ఆర్ కు 5/5 రేటింగ్ ఇవ్వొచ్చని వారి మాటలని బట్టి అర్థమవుతోంది.
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల్లో ఓ ఉమ్మడి పాయింట్ ఆధారంగా రాజమౌళీ ఈ కథను రాసుకున్నారు. అల్లూరిగా రామ్ చరణ్, ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించారు. ఇక కొమరం భీమ్ పాత్రలో తారక్, ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించారు. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. దాదాపు 500కోట్లకు పైగా బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు.