వలిమై OTT రిలీజ్ డేట్ ఫిక్స్

హెచ్ వినోద్‌ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన సినిమా ‘వలిమై’. ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రిలీజై నేటికి 25 రోజులు గడుస్తున్నా.. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. థియేటర్స్ రిలీజ్ కు నాలుగు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డీల్ కుదిరింది. ఈ నేపథ్యంలో మార్చి 25 నుంచి వలిమై జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక వలిమై లో యాక్షన్ ఏపీసోడ్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా బైక్ స్టంట్స్ ఏపీసోడ్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయి. అజిత్-కార్తీకేయన్ గ్యాంగ్ మధ్య నడిచే యాక్షన్ వార్ చాలా బాగుంది. వలిమై దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలోనే అజిత్ నెక్ట్స్ సినిమా రాబోతుంది. ఈ సినిమాని కూడా బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక #AK62 విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే.