అశ్వద్ధామగా బిగ్ బీ

నాగ అశ్విన్ దర్శకత్వం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె నటిస్తుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకు సంబంధించిన వివరాలు తాజా బయటకు లీక్ అయ్యాయి. ఇందులో అమితాబ్ అశ్వద్ధామగా కనిపించబోతున్నారు.

ఆంజనేయుడు, అశ్వద్ధామ లాంటి వాళ్లకు చావు లేదని పురాణాలు చెబుతున్నాయి. వీళ్లింకా బతికే ఉన్నారన్నది చాలామంది నమ్మకం. హిమాలయాల్లో ఆంజనేయుడు ఇంకా తిరుగుతున్నాడని కథలు కథలుగా చెబుతుంటారు. నిజంగా అశ్వద్ధామ కూడా ఇప్పటికీ బతికే ఉంటే.. ? అనే ఆలోచనకు బీజమే.. ప్రాజెక్ట్ కే. ఇందులో పాత్రలన్నీ పురాణ పాత్రల ప్రేరణతో రాశారని సమాచారం. అందులో అశ్వద్ధామ పాత్ర ఒకటి. ఇక ప్రభాస్ ఎలాంటి పాత్ర పోషింస్తున్నారో ఇంకా తెలీదు. కల్కీ అవతార్ లో ప్రభాస్ కనిపించబోతున్నాడనే పచారం కూడా ఉంది.