తుఫాన్ వచ్చేసింది

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018లో వచ్చిన చిత్రం ‘కేజీఎఫ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా పార్ట్ 2 గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కరోనా విజృంభణతో ఈ ఏడాది ఏప్రిల్ 14కి వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ షురు చేసింది చిత్రబృందం. 

తుఫాన్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శ్రీకృష్ణ, పృధ్వీ చంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, సంతోష్ వెంకీ, మోహన్ కలిసి పాడారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. కేవలం ఇదొక లిరికల్ సాంగ్ గా కాకుండా.. సాంగ్ నేపథ్యాన్ని వివరిస్తూ.. వీడియోను తీసుకొచ్చారు. రొమాలు నిక్కబొడిచేలా సాంగ్ ఉంది.  

ఇక చాప్టర్ 2లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అధీర పాత్రలో అలరించనున్నాడు. రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కన్నడ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ బాషల్లో ఒకేసారి విడుదల కానుంది.