ఆప్ ఎంపీ ర్యాంప్ వాక్

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సరికొత్త అవతారం ఎత్తాడు. ఢిల్లీలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేశాడు. డిజైనర్ పవన్ సచ్దేవ కోసం నటుడు అపర్శక్తి ఖురానాతో కలిసి ర్యాంప్ వాక్ చేసి అలరించారు.
సచ్దేవ్ డిజైన్ చేసిన లెదర్ జాకెట్ ధరించి వీక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రాఘవ్ చద్దా ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్ నుంచి ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల్లో రాఘవ్ చద్దా కూడా ఒకరు.
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ విజయంలో చద్దా కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనను పార్టీ హైకమాండ్ రాజ్యసభకు పంపించింది.33 ఏళ్ల చద్దా.. పెద్దల సభకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు కావడం విశేషం.