‘శివపుత్రుడు’ కాంబో రిపీట్

దాదాపు 18 ఏళ్ల తర్వాత సూర్య-బాలా కాంబినేషన్లో మరో చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సూర్య 41’ వర్కింగ్ టైటిల్‌తో కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సూర్య సరసన కృతిశెట్టి సందడి చేయబోతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్మెంట్స్.. నిర్మిస్తోంది.

సూర్య, విక్రమ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ చిత్రం ‘పితామగన్’. తెలుగులో ‘శివ పుత్రుడు’ పేరుతో విడుదలై.. ఇక్కడా ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతోనే సూర్య, విక్రమ్ ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు కోలీవుడ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇండస్ట్రీకి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇన్నాళ్లకు బాల-సూర్య మరోసారి జతకట్టడంతో.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
