పూరి-విజయ్ మరో సినిమా.. రేపే ఎనౌన్స్ మెంట్ !

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. విజయ్ కి జంటగా అనన్య పాండే నటిస్తుంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదో పాన్ ఇండియా సినిమా. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఆగస్ట్ 15న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

పూరి-విజయ్ కాంబో మరో సినిమా రాబోతుందనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ.. ఈ ప్రచారం నిజమైంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు రానుంది. ఈ మేరకు దర్శకుడు పూరి అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా కూడా కరణ్ జోహార్ భాగస్వామ్యంతో తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తుంది.