అలియా అలక.. రాజమౌళిని అన్‌ఫాలో ?

RRRతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో కనిపించారు. అసలైన కథ కూడా ఈమె ద్వారానే రివీల్ అవుతుంది. అయితే సినిమాలో అలియా పాత్ర చిన్నది. పెద్దగా నటనకు స్కోప్ కూడా లేదు. ఈ విషయంలో ఆలియా అసంతృప్తి చెందారనీ.. ఆ కోపంతోనే ఇన్‌స్టా వేదికగా రాజమౌళిని అన్‌ఫాలో చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఆమె ఇన్‌స్టా ఖాతాని చెక్ చేస్తే.. ఆమె ఫాలో అయ్యే 475 మందిలో రాజమౌళి, తారక్, చరణ్ ముగ్గురూ ఉన్నారు. అలాగే ఆమె ఖాతాలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ పోస్టర్లు, రాజమౌళితో సెట్స్‌లో దిగిన ఫొటోలు అన్నీ ఉన్నాయి.