జాన్వీ.. జనగణమన

బాలీవుడ్ హీరోయిన్లను సౌత్ కు పరిచయం చేయడం పూరి జగన్నాధ్ కు కొత్త కాదు. కంగన, అనన్య, దిశాపటానీ.. ఇలా చాలామందిని సౌత్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి జాన్వి కపూర్ కూడా చేరబోతోందని సమాచారం. పూరి-విజయ్ దేవరకొండ కాంబోలో రెండో పాన్ ఇండియా సినిమాగా ‘జనగణమన’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

వచ్చేనెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఒప్పించినట్లు తెలుస్తుంది. తనకు టాలీవుడ్ అంటే ఇష్టమని, మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఉందంటూ గతంలోనే జాన్వి కపూర్ ప్రకటించింది. ఇప్పుడీ జేజీఎంతో అవన్నీ సెట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సినిమా కోసం కెరీర్ హయ్యస్ట్ రెమ్యూనరేషన్ అందుకోబోతోందట జాన్వి.