మాస్ కలెక్టర్.. ఫస్ట్ ఎటాక్ !

హీరో నితిన్ లెటెస్ట్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’. ఇదో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. కృతి శెట్టి, కేథరీన్‌  హీరోయిన్స్ . ఇందులో నితిన్  కలెక్టర్ పాత్ర చేస్తున్నాడు. పొలిటికల్ టచ్ వున్న కథ చేయడం నితిన్ కెరీర్ లో ఇదే తొలిసారి. అందులోనూ కలెక్టర్ పాత్రలో చేయడం కథపై ఆసక్తిని పెంచుతుంది. 

ఈ రోజు నితిన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్ బయటికి వచ్చింది. డైలాగ్స్ ఏమీ లేకుండా కేవలం యాక్షన్ సీన్ ని చూపించారు. ఈ సీన్ షాలిడ్ గా వుంది. ఈ చిత్రంతో ఎంఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.