మహేష్ సినిమా.. రాజ‌మౌళి ఏడాది డెడ్ లైన్ !

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజ‌మౌళి సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఒక్కో సినిమాకు మినిమమ్ మూడేళ్లు తీసుకునే జక్కన్న మహేష్ సినిమాను కేవలం ఏడాదిలో పూర్తి చేయాలనే డెడ్ లైన్ పెట్టుకున్నాడట.

ఈ జూన్ నుంచి.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లెట్ట‌బోతున్నాడు రాజ‌మౌళి. 2023 జ‌న‌వ‌రిలో సినిమా మొద‌లెట్టి, 2024 జ‌న‌వ‌రిలో సినిమాని పూర్తి చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి మ‌రో రెండు మూడు నెల‌లు ప‌ట్టినా… 2024 వేస‌విలో మ‌హేష్ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌నుకుంటున్నాడ‌ట. ఆరు నూరైనా ఈ సారి యేడాదిలోనే సినిమా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు జ‌క్క‌న్న‌. అందుకే ప్రీ ప్రొడ‌క్ష‌న్ కి ఏకంగా ఆరు నెల‌లు తీసుకుంటున్నాడట. ఇక ఆర్ ఆర్ ఆర్ హిట్ ఆనందంలో ఉన్న జక్కన్న త్వరలో ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కి వెళ్లనున్నారు.