ప్రభాస్-అనుష్క.. రిపీట్ !

ప్రభాస్-అనుష్క లపై ఎప్పటికప్పుడు కొత్త గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఈ జంటపై మరో పుకారు చెలరేగింది. ప్రభాస్-అనుష్క మరోసారి కలుస్తున్నారట. మరోసారి తెరపై కలిసి నటించబోతున్నారట. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారంటూ ఇప్పటికే చాలా పేర్లు తెరపైకొచ్చాయి. మాళవిక మోహనన్, రాశీఖన్నా, శ్రీలీల పేర్లు ప్రధానంగా వినిపించాయి. ఇప్పుడు స్వీటీ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం స్వీటీ సినిమాలే చేయడం లేదు. ఆమె బరువు ఇంకా తగ్గలేదు. ఒకట్రెండు పవర్ ఫుల్ కథలు వచ్చినా.. అవి ఇంకా చర్చల దశలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అనేసరికి స్వీటీ రెడీ అనేసిందట.