రణబీర్ తో రష్మిక రొమాన్స్

బాలీవుడ్ లో గుడ్ బై, మిషన్ మజ్ను అనే సినిమాలు చేస్తోంది రష్మిక. ఈ రెండూ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేశాయి. వీటిలో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే, ఆమెకు బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి. త్వరలోనే రణబీర్ కపూర్ సరసన రష్మిక నటించబోతోందట.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా ఓ సినిమా లాక్ అయింది. ఇందులో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే ఆమెను తప్పించారంట. ఆ స్థానంలో రష్మికను తీసుకుబోతున్నారనేది లెటెస్ట్ టాక్. రణబీర్ లాంటి హీరో సరసన ఛాన్స్ అంటే రష్మిక బాలీవుడ్ కెరీర్ కు కచ్చితంగా అది పెద్ద హెల్ప్ అవుతుంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ? అనేది తెలియాల్సి ఉంది.