బాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సెంచరీ.. నాటౌట్ !

బాలీవుడ్ లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతోంది. అక్కడ అప్పుడే కలెక్షన్స్ సెంచరీ దాటేశాయి. శుక్రవారం రూ. 20.07 కోట్లు, శనివారం రూ. 24 కోట్లు, ఆదివారం 31.50 కోట్లు, సోమ  రూ.17 కోట్ల, మంగళవారం రూ. 15.02 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఆర్ ఆర్ ఆర్ మొత్తం హిందీ కలెక్షన్స్ రూ. 107.59 కోట్లకు చేరుకుంది. మరోవారంలో డబుల్ సెంచరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోవైపు దేశ వ్యాప్తంగా కలెక్షన్స్ పెరుగేందుకు ఆర్ ఆర్ ఆర్ మాస్టర్ ప్లాన్ ఒకటి అమలు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా త్రీడి లో ఫార్మాట్‌ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే త్రీడీ స్క్రీనింగ్ చాలా తక్కువ. హైదరాబద్ మొత్తంలో ఒక్క థియేటర్ మాత్రమే బుక్ మై షో లాంటి యాప్స్ లో కనిపిస్తుంది. ఈ వీకెండ్ నుంచి త్రీడీ స్క్రీన్స్ పెంచాలని నిర్ణయానికి వచ్చారు నిర్మతాలు. దేశవ్యాప్తంగా స్క్రీన్లు పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే కాకుండా ఆ శుక్రవారం నుంచి పెంచిన టికెట్ల రేట్లు తగ్గించాలని డిస్టిబ్యూటర్స్ కి సమాచారం ఇచ్చారు. త్రీడి స్క్రీన్ లు పెంచడం, టికెట్ల ధర తగ్గించడం వలన రెండో వారం కూడా కూడా కలెక్షన్స్ స్టడీగా ఉంచాలనే ఆలోచనలో వున్నారు.