ఏనుగుపై నుంచి కింద పడిన మెగాస్టార్

చిరు-బాబి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వాల్తేరు శ్రీను టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించినయాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఇందులో భాగంగా చిరంజీవి ఏనుగుపై సవారీ చేసే సీన్ తీశారు. ఈ సీన్ లో ఏనుగు నుంచి కిందకి దిగేక్రమంలో.. చిరు జారి పడ్డారట. ఆయన కాలు బెణికిందని తెలుస్తోంది.
ఈ గాయాన్ని లైట్ తీసుకున్న చిరు.. ఆ నొప్పిని ఓర్చుకొంటూ… ఆ రోజు చిరు షూటింగ్ పూర్తి చేశారట. తాను వెళ్లిపోతే.. షూటింగ్ డిస్ట్రబ్ అవుతుందని, మిగిలినవాళ్ల కాల్షీట్లు వేస్ట్ అవుతాయని భావించిన బాధతోనే తన సీన్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఉట్టిగనే మెగాస్టార్లు అయిపోరు.. అనడానికి ఇదో చిరు ఉదాహరణ.