ఇప్పటికీ బాలీవుడ్ నెం.1.. తెలుగులో చేయను

బాహుబలితో బాలీవుడ్ లో టాలీవుడ్ హవా మొదలైంది. బాహుబలి 2, సాహో, పుష్ప సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అదరగొడుతోంది. ఆ వెంటనే సౌత్ నుంచి కేజీఎఫ్ 2 రాబోతుంది. లైగర్ లైన్ లో ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో-హీరోయిన్లు సౌత్ వైపు చూస్తున్నారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సైతం తెలుగు సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ లో మెరబోతున్నాడు.

అయితే కొంత మందికి బాలీవుడ్ హీరోలు  మాత్రం ఇంకా హెడ్ వెయిట్ తగ్గడం లేదు. రొమాంటిక్ సినిమాలు చేసి కాస్త ఫేమ్ తెచ్చుకునితర్వాత ఫైటింగ్ సినిమాలు చేస్తున్న జాన్ అబ్రహం.. తనను తాను పెద్ద బాలీవుడ్ హీరో అనుకుంటున్నారు. తాను బాలీవుడ్ హీరోనని రీజనల్ సినిమాల్లో నటించేదే లేదని తేల్చి చెప్పారు జాన్ అబ్రహం. ఆయన హీరోగా తెరకెక్కిన ‘ఎటాక్’ అనే సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇంటర్యూల్లో ‘సలార్’ సినిమాలో ఆయన నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్లపై స్పందించారు. తను ఎలాంటి తెలుగు సినిమాలో నటించడం లేదని.. ఎప్పటికీ ప్రాంతీయ సినిమాల్లో నటించనని చెప్పారు. తనొక బాలీవుడ్ హీరోనని.. ఎప్పటికీ ఇతర భాషల్లో సెకండ్ హీరోగా, సహనటుడు పాత్రలు చేయనని స్పష్టం చేశారు.