‘కేజీయఫ్‌-2’కి డైలాగ్స్‌ రాసిన యశ్

ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ ట్రైలర్‌ ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో ప్రథమ స్థానంలో దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం విడుదలైన ‘కేజీయఫ్‌’కు సీక్వెల్‌గా వస్తోంది.
ట్రైలర్ లో ‘వైలెన్స్‌.. వైలెన్స్‌.. వైలెన్స్‌.. ఐ డోంట్‌ లైక్‌ ఇట్‌.. బట్‌.. వైలెన్స్‌ లైక్స్‌ మీ’ అంటూ హీరో చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయ్. అయితే తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ స్వయంగా యశ్ నే రాసుకొన్నారట.

ఈ విషయాన్ని తాజా  ఇంటర్వ్యూలో దర్శకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. “కేజీయఫ్‌-2’ ట్రైలర్‌ చూసిన చాలా మంది డైలాగ్స్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నాయని చెబుతున్నారు. యశ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ బాగున్నాయని చెబుతున్నారు. అయితే, తన పాత్రకు సంబంధించిన చాలా డైలాగ్స్‌ని యశ్‌నే రాసుకున్నారు” అని ప్రశాంత్‌నీల్‌ చెప్పారు