భలే భలే బంజారా.. వచ్చేసింది

మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ పై ఫోకస్ పెట్టిన చిత్రబృందం సోమవారం ‘భలే భలే బంజారా.. ‘ సాంగ్ ను విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. మణిశర్మ సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్య రీతులు అందించారు.

ఇక ఈ పాటలో చిరు, చరణ్ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తండ్రి-కొడుకులు పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. సాంగ్ లో మేకింగ్ సీన్స్ ను చూపించారు. మెగా ఫ్యామిలీ సెట్స్ కు వచ్చి సందడి చేయడం  చూడొచ్చు. ఈ సినిమాలో చిరుకి జంటగా కాజల్ నటించగా.. చరణ్ కి జంటగా పూజా హెగ్డే కనిపించనుంది.