ఐపీఎల్‌ క్యాన్సిల్

ఐపీఎల్ ను బ్యాన్ చేయాలనే డిమాండ్ వినబడుతోంది. #CANCELIPL హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతోంది. మరోవైపు దీనిపై ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఢిల్లీ మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ – 2022 ను బ్యాన్ చేయాలనే డిమాండ్ మొదలైంది. 

మరోవైపు ఐపీఎల్ పై ఓ సినిమా రాబోతుంది. ఐపీఎల్ కి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.. ల‌లిత్ మోడీ. ఇప్పుడు అత‌ని గురించి, అత‌ను సృష్టించిన ఐపీఎల్ గురించీ ఓ సినిమా రాబోతోంది. మావిరిక్ క‌మీష‌న‌ర్‌: ద ఐపీఎల్ ల‌లిత్ మోడీ సెగ‌ పేరుతో బొరియా మ‌జుందార్ అనే ర‌చ‌యిత ఓ పుస్త‌కం రాశాడు.

ఇప్పుడు ఆ పుస్త‌కం ఆధారంగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. త‌లైవి, 83 లాంటి చిత్రాల‌ను అందించిన విష్ణు ఇందూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. మారివిక్ క‌మీష‌న‌ర్‌ రైట్స్‌ని విష్ణు ఇందూరి ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించే ఈ చిత్రంలో స్టార్ హీరోలు క‌నిపిస్తార‌ని టాక్‌.