కేజీఎఫ్ 2 నాలుగు రోజుల కలెక్షన్స్ రూ. 546 కోట్లు

కేజీఎఫ్ 2 బాక్సాఫీసును దున్నేస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ. 546 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిన గ్రాస్ ఇది. ఇండియన్ సినిమా రికార్డులన్నీ బద్దలు కొట్టింది. కేజీఎఫ్ సీక్వెల్ గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. పార్ట్ 1 కు మించి పార్ట్ 2 ను తీసుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆయన టేకింగ్ కు యష్  నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్ అదిరిపోయాయ్. మాటల తూటాలు అదనపు బలం. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉన్నాయి.

సౌత్ నుంచి మరో రాజమౌళి వచ్చాడని బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ ప్రతిభకు ఫిదా అవుతున్నారు. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన కేజీఎఫ్ 2.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 500 మార్క్ ను చేరుకోవడం విశేషం. బాహుబలి, బాలిబహులి 2, ఆర్ ఆర్ ఆర్ కూడా సాధ్యం కానీ విధంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.