వారంలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

నిరుద్యోగులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ను వారంలో విడుదల చేస్తామని.. నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని అన్నారు.  రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితిని సీఎం కేసీఆర్‌ మూడేళ్లు పెంచారన్నారు. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశామని.. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నామని హరీశ్‌ చెప్పారు.

సంగారెడ్డిలో పోలీసు శిక్షణ శిబిరాన్ని సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తోందని.. కేంద్రంలో 15 లక్షలకు పైగా పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ఆయన నిలదీశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలో ఉద్యోగాల భర్తీపై ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.