షావోమి కొత్త స్మార్ట్ ట్యాబ్.. ఫీచర్లు
షావోమి నుంచి మరో కొత్త స్మార్ట్ ట్యాబ్ రాబోతుంది. ఏప్రిల్ 27న జరగబోయే ఈవెంట్‌లో షావోమి 12 ప్రోతో పాటు కొత్త మోడల్ ‘స్మార్ట్ ప్యాడ్ 5’ను ఆవిష్కరించనున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత తిరిగి స్మార్ట్ ట్యాబ్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుండటం గమనార్హం.
ఈ కొత్త స్మార్ట్ ప్యాడ్ 5, షావోమి 12 ప్రో ఫీచర్లు ఏంటో చూద్దాం..
5 11 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది.
స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌ను వాడారు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ (MIUI) 12.5 ఓఎస్‌తో ఇది పనిచేస్తుంది
120Hz రిఫ్రెష్ రేట్, 240Hz స్యాంప్‌లింగ్ రేట్
డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10 ప్లేబ్యాక్ సపోర్ట్ చేస్తుంది
దీని వెనుకభాగంలో 13ఎంపీ కెమెరా, ముందుభాగంలో సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను అమర్చారు.
డాల్బీ అట్మోస్ ఫీచర్‌తో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ప్యాడ్ 5లో క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఉంటుంది
8,720ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతోపాటు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తోంది
6జీబీ+128జీబీ వేరియంట్, 8జీబీ+256జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్ ప్యాడ్ లభిస్తోంది
6జీబీ+128జీబీ వేరియంట్ ధరను కంపెనీ రూ.24,000గా
6జీబీ+256జీబీ వేరియంట్ ధరను రూ.27,600గా నిర్ణయించినట్లు టెక్ వర్గాల సమాచారం.