తిరుపతిలో నయన్-విఘ్నేష్ పెళ్లి.. డేట్ ఫిక్స్ !

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఈ జంటగా ప్రేమలో ఉంది. వీరి పెళ్లి నాన్ స్టాప్ గా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మధ్య మధ్యలో ఈ జంట విడిపోయిందనే రూపర్స్ కూడా వినిపించాయి. అయితే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ.. నయన్-విఘ్నేష్ తమ పెళ్లి డేటును ప్రకటించారు.

శనివారం ఉదయం ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన నయన్-విఘ్నేష్.. తిరుమలలోనే పెళ్లి చేసుకోబోతున్నాం. జూన్ 9న ముహూర్తం ఫిక్సయిందని చెప్పినట్టు తెలిసింది. హీరోయిన్ గా నయన్, దర్శకుడిగా విఘ్నేష్ దూసుకెళ్తున్నారు. అట్లీ సినిమాతో నయన్ బాలీవుడ్ లోకి ఇంట్రీ ఇవ్వనుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 62వ సినిమాకు విఘ్నేష్ దర్శకత్వం వహించనున్నారు.