ఊరి పేరు భైరవ కోన.. టైగర్ కాంబో !

సందీప్ కిషన్ – విఐ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ సినిమా వచ్చింది. పెద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు.. వీరి కలయికలో మరో సినిమా రాబోతుంది.  వైవిధ్యమైన సబ్జెక్ట్ లు ప్రిపేర్ చేసే విఐ ఆనంద్ ఈ సారి ఓ థ్రిల్లింగ్ కథతో మళ్లీ సందీప్ కిషన్ తో సినిమా చేస్తున్నారు. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్ కలిసి నిర్మించే ఈ సినిమా టైటిల్..ఊరి పేరు భైరవ కోన. 

సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా శనివారం భైరవకోన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేశారు. పోస్టర్ లో ఒక సరికొత్త లోకం అన్నట్లుగా బ్యాక్ డ్రాప్, అలాగే చేతిలో చిత్రమైన కర్రతో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య ధాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.