ఎవరీ.. రితికా నాయక్ ?

‘అశోకవనంలో అర్ఙున కళ్యాణం’ సినిమాలో హీరోయిన్ ఎవరు అంటే రుష్కర్ థిల్లాన్. సినిమా ప్రచారం కూడా విశ్వక్ సేన్, రుష్కర్ మీదనే జరిగింది. అయితే సినిమా చూసిన ప్రేక్షకుల మనసులను మాత్రం మరో హీరోయిన్ దోచేసింది. ఆ అమ్మాయి పేరు కూడా జనాలకు పెద్దగా తెలియదు. సినిమాలో సెకెండ్ హీరోయన్ అనుకుంటే క్లయిమాక్స్ వేళకు మెయిన్ హీరోయిన్ అయిపోయింది. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించిన ఆ అమ్మాయి పేరు రుతిక నాయక్. థిన్ పర్సనాలిటీతో, ఆకట్టుకునే నటనతో కనిపించింది.
‘అశోకవనంలో అర్ఙున కళ్యాణం’లో రితికా నటన చూసిన వారంతా.. టాలీవుడ్ కు మరో హీరోయిన్ దొరకింది. మీడియం రేంజ్ హీరోలకు పర్ ఫెక్ట్ ఫిగర్ అంటున్నారు. సినిమా రిలీజ్ కు ముందు రితికా పేరు వినిపించలేదు. ఆమె మీడియా ముందు కనిపించలేదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పాత, కొత్త ఫోటోలు షేర్ చేస్తున్నారు.