రాజశేఖర్-సుకుమార్.. ఓ జీవిత స్టోరీ !
హీరో రాజశేఖర్ ను చూసిన తర్వాతే తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందని టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజశేఖర్ ప్రకటించాడు. తన సినీ జీవితానికి బీజం వేసిన వ్యక్తిగా రాజశేఖర్ ను చెప్పుకొచ్చాడు. రాజశేఖర్ హీరోగా నటించిన చిత్రం ‘శేఖర్’. ఈ సినిమాకు జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించారు. మలయాళీ హిట్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాజరైన సుకుమర్.. తన జీవితాన్ని రాజశేఖర్ ఎలా మార్చారో వివరంగా చెప్పుకొచ్చారు.
చిన్నప్పుడు సుకుమార్ ఊర్లో.. ఓ స్నేహితుడు ఉండేవాడట. తను అందరి గొంతుల్నీ మిమిక్రీ చేస్తూ… సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండేవాడట. తనని చూసి సుకుమార్ ఎప్పుడూ జెలసీ ఫీలవుతూ ఉండేవాడట. ఓరోజు.. అందరి దష్టిలో పడేందుకు.. సుకుమార్ రాజశేఖర్ గొంతునీ, స్టైల్‌నీ ఇమిటేట్ చేసి చూపించాడట. దాంతో అందరూ సుకుమార్ ని మెచ్చుకొన్నారట. అలా.. అందరి దృష్టిలో పడ్డానని చెప్పుకొచ్చాడు సుకుమార్. తాను కూడా సినిమాల్లోకి రాగలనని, సినిమాలకు పనికొస్తానన్న నమ్మకం… ఆ రోజే వచ్చిందని, అందుకే సభాముఖంగా రాజశేఖర్‌కు కృతజ్ఞతలు చెప్పేశాడు సుకుమార్.
“నిజంగా నా జీవితాన్ని మార్చిన వ్యక్తి రాజశేఖర్. ఆరోజు ఆయన్ని ఇమిటేట్ చేయకపోతే. నాలో కాన్ఫిడెన్స్ వచ్చేది కాదు. ఈ విషయం ఇప్పటి వరకూ ఏ వేదికపైనా పంచుకోలేదు. ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. ఇప్పుడొచ్చింది కాబట్టి చెబుతున్నా” అంటూ తన బాల్య జ్ఞాపకాల్ని పంచుకున్నాడు సుకుమార్.
పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్.. పుష్ప 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు.